విమానం నడిపేటప్పుడు నిత్యం అప్రమత్తతో ఉండాలి. అయితే ఇటలీలో ఓ పైలట్ నిబంధనలను పక్కన పెట్టి చక్కగా నిద్రపోయాడు. న్యూయార్క్ నుంచి రోమ్కు బయల్దేరిన ఐటీఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏజెడ్609 విమానం నుంచి ఇటీవల ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. అధికారులు భయపడి ఉగ్రవాదులు హైజాక్ చేసి ఉండొచ్చనే ప్రకటన విడుదల చేశారు. తీరా పైలట్ నిద్రపోయాడని తెలుసుకుని అతడిని సస్పెండ్ చేశారు.