కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. సోమవారం సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై ఎన్జీటీ విచారణ జరుపుతున్నప్పటికీ మైనింగ్ ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమ మైనింగ్ వల్ల ఈ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు.