చిలకలూరిపేట మండలంలోని కావూరుకు చెందిన షేక్ ఖాసిం ను బ్లేడుతో కోసి గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడిన లింగంగుంట్ల గ్రామానికి చెందిన షేక్ ఖాసిం సైదాను చిలకలూరిపేట రూరల్ ఎస్సై రాజేష్ సోమవారం అరెస్టు చేశారు. ఖాసీం ఇంట్లో వారిని తిట్టాడున్న కోపంతో రెండు రోజుల క్రితం ఖాసిం సైదా బ్లేడుతో ఖాసిం పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఖాసిం సైదాను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ ఐ తెలిపారు.