నిండు గర్భిణీని తమ కుటుంబీకులే 9 కిలో మీటర్లు మోశారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాజులబంద గ్రామానికి చెందిన పాంగి శాంతికి నొప్పులు రాగా అంబులెన్స్ సౌకర్యం లేని ఆ ప్రాంతంలో కుటుంబీకులే దాదాపు 9 కిలో మీటర్లు డోలీలో గర్భిణీని మోసుకుంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరారు. వైద్యుల సూచన మేరకు విశాఖ నగరలోని కేజీహెచ్ లో ఆమెను చేర్చారు. నేడు ఆమె బిడ్డకు జన్మినిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa