ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ రాష్ట్రంలో ఏ తప్పు జరిగిన వెంటనే స్పందిస్తున్నారు. ఇదిలావుంటే దేశంలో ఉత్తరప్రదేశ్‌కి బ్యాడ్ నేమ్ ఉంది. అదో నేరాల అడ్డా అంటారు చాలా మంది. అంతేకాదు.. దేశంలో ఎక్కడెక్కడో జరిగే చైన్ స్నాచింగ్ నేరాల మూలాలు. ఉత్తరప్రదేశ్ దగ్గర్లో లభిస్తుంటాయి. అందుువల్ల ఆ రాష్ట్రంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చేయాలి అనుకున్నారో ఏమోగానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పుడు స్పీడ్ పెంచారు. రోడ్లపై ఏ చిన్న తప్పు చేసినా వదలట్లేదు. తాజాగా ఓ కుక్రాడు రాత్రివేళ నోయిడాలో జీప్ నడుపుతూ అమెరికన్లు ఆడే బేస్ బాల్ బ్యాట్‌ని చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కట్ చేస్తే ఆ కుర్రాణ్ని అరెస్టు చేసి జీప్‌ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. (దీనికి సంబంధించి పోలీసులు ట్విట్టర్‌లోని తమ అకౌంట్ Uppoliceలో మే 29, 2022న ఓ వీడియోని పోస్ట్ చేశారు. అందులో... బేస్ బాల్ స్టంట్.. ఆ తర్వాత కుర్రాడి అరెస్టు, జీప్ స్వాధీనం విజువల్స్ ఉన్నాయి. అరెస్టైన కుర్రాడు... "జీవితంలో ఇంకెప్పుడూ స్టంట్స్ చెయ్యను. నన్ను క్షమించండి" అని వేడుకుంటున్నాడు. అలా దారికి తెస్తున్నారు పోలీసులు.
ఇదే కాదు మరో వీడియోలో ఓ వ్యక్తి రాత్రివేళ జీప్ నడుపుతూ కరెన్సీ నోట్లను విసిరేస్తూ వెళ్లాడు. అది కూడా నోయిడాలోనే. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు చూశారు. కట్ చేస్తే జీప్‌ని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్ని మే 29, 2022 నాడు ట్విట్టర్‌లోని తమ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
"మీరు రోడ్లపై స్టంట్స్ చేస్తే... మేము హంట్ చేస్తాం. వాహనం సీజ్ చేసి... మిమ్మల్ని జైల్లో పెడతాం" అని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇవ్వడమేంటి.. చేసి చూపిస్తున్నారు కూడా. ఇలా యూపీ పోలీసులు... తాట తీస్తున్నారు. అడ్డదారుల్లో వెళ్తున్న యువతను సరైన మార్గంలోకి లాక్కొస్తున్నారు. ఎక్స్‌ట్రాలు చేసేవాళ్లకు... ఆనందం తీర్చేస్తున్నారు. అందుకే వాళ్ల తీరు నెటిజన్లకు నచ్చుతోంది. పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "ఎవరైనా సరే... రోడ్లపై స్టంట్స్ చేస్తే... నోయిడా పోలీసులు కచ్చితంగా లెసన్ చెబుతారు" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "ఇలాంటి వాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలి. థాంక్యూ పోలీస్" అని మరో యూజర్ మెచ్చుకున్నారు. "బాగా చేస్తున్నారు" అని మరో యూజర్ మెచ్చుకున్నారు. గత వారం యూపీ పోలీసులు... బైక్‌పై పడుకొని స్టంట్ చేసిన ఓ కుర్రాణ్ని అరెస్టు చేసి... వెహికిల్ సీజ్ చేశారు. అంతకుముందు... రెండు ఎస్ యూ వీ లపై కాళ్లు పెట్టి వెళ్లిన కుర్రాణ్ని అరెస్టు చేసి... 2 వాహనాలనూ సీజ్ చేశారు. ఇక ఇప్పుడు యూపీలో స్టంట్స్ చేసేవాళ్లకు వెన్నులో వణుకే.