ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు స్కూళ్లు, ట్యుటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 3-7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. గ్రేడ్లకు బదులు మార్కులు ఇస్తున్నందున ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేసింది.