ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరుగుతున్న కేసులు...తమవంతు పాత్ర పోషిస్తున్న ఆ రాష్ట్రాలు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 03:06 PM

మొన్నటి వరకు భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదలలో కేరళ,  మహారాష్ట్ర రాష్ట్రాలు ప్రధాన  పాత్ర పోషించాయి. ఆ రాష్ట్రాల్లోనే కరోనా కేసులు సంఖ్య ఎక్కువగా నమోదు అయింది. తాజాగా మళ్లీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేరళ,  మహా రాష్ట్రాల నుంచే మళ్లీ కరోనా కేసులు అత్యధికంగా పెరగడం చర్చాంశనీయంగా మారింది.


మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ముందు రోజు 2,745గా ఉన్న కేసుల సంఖ్య మరోసారి మూడు వేలను దాటింది. గత 24 గంటల్లో 3,712 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచే రెండు వేలకు పైగా కేసులు వచ్చాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 739 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఐదుగురు చనిపోయారు. 


ఇక దేశంలో ప్రస్తుతం 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది. మరోపక్క, 4,26,20,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,641 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1.94 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 12,44,298 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com