వంటగ్యాస్ సిలిండర్ల వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్‌పై ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీని నిలిపివేసింది. వంటగ్యాస్ సిలిండర్ ఖరీదు ఎక్కువైతే వినియోగదారుడు పూర్తి ధరను భరించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ తెలిపారు. ఇక నుంచి ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే గ్యాస్‌పై సబ్సిడీ లభిస్తుంది. ఉజ్వల పథకంలో భాగంగా లబ్ధిదారులకు సాలీనా 12 సిలిండర్లు అందజేయనున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గింపు ఇస్తున్నారు.దేశంలో గృహ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే రూ.1000 దాటింది. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీని తొలగించడంతో పూర్తి భారం వినియోగదారుడిపై పడనుంది.