తమిళనాడు ప్రభుత్వానికి విగ్రహాలు అప్పగించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 15, 16వ శతాభ్దంలో చోరీకి గురైన విగ్రహాలను విదేశాల నుంచి భారత్ కు తెప్పించిన కేంద్ర ప్రభుత్వం వాటిలో తమిళనాడుకు చెందిన విగ్రహాలను ఆ రాష్ట్రానికి అప్పగించింది. ఆ విగ్రహాలను తమిళనాడుకు కేంద్రం తరఫున కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవడం వలనే విదేశాల్లో ఉన్న పురాతన విగ్రహాలను భారత్ తీసుకురావడానికి అవకాశం చిక్కిందని, ఈ క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుందని కేంద్ర మంత్రి కిసన్ రెడ్డి అన్నారు.