దేశంలో 3 నెలల తర్వాత రోజువారీ కరోనా కేసులు 4 వేల మార్కును దాటాయి. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,041 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో పోరాడుతూ 10 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,177కి చేరుకుంది. గురువారం నాడు 3,712 కేసులు, 5 మరణాలు సంభవించాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాలలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa