వేసవిలో బయటకు వెళ్లాలంటే, ట్యాన్ భయం ప్రతి ఒక్కరిని పీడిస్తుంది. ముఖానికి మాస్క్, స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల కొద్దిలో కొద్దిగా ముఖానికి సూర్యుని ఎండ తగలదు. కానీ చేతులు, మెడ భాగాలు ఎండకు నేరుగా గురవుతాయి. దీంతో ఆ భాగాల్లో ట్యాన్ బాగా పట్టేసి త్వరగా పోదు. ఇందుకోసం చిన్న చిట్కా ఉంది. నాచురల్ పదార్థాలతో ట్యాన్ ను తొందరగా తొలగించుకోవచ్చు.
మూడు స్పూన్ల అలోవెరా గుజ్జుకు, ఒక్కో స్పూన్ చొప్పున తేనె, పసుపు కలిపి చేతులకు, మెడకు రాయాలి. పది నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. సహజ పద్ధతిలో చేతులకు, మెడకు పట్టిన ట్యాన్ ను ఈ చిట్కా వేగంగా తొలగించటమే కాక, ఆ భాగాలను మృదువుగా, మెరిసేలా చేస్తుంది.