పల్నాడు జిల్లా , మాచర్ల నియోజకవర్గ పరిధిలో హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఐతే హత్య కి గురైన బాధితుడు టీడీపీ పార్టీకి సంభంధించిన వారు కావడంతో , స్థానిక టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి భాధితుడైన జాలయ్య అంత్యక్రియలకి హాజరు కావాలని బయలుదేరారు. కానీ ... మరణించిన తెలుగుదేశం బీసీ నేత జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ... అంత్యక్రియల్లో పాల్గొనడానికి గానీ... నరసరావుపేటకు రాకుండా తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేసారు.