ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో శుక్రవారం విషవాయువు అమోనియా లీక్ అయిన ఘటనలో 300ల మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ప్రభుత్వం శనివారం స్పందించింది. విషవాయువులు లీక్ అయిన సీడ్స్ వస్త్ర పరిశ్రమను తాత్కాలికంగా మూసేయాలని ఆదేశాలిచ్చింది. విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తిరిగి తెరవాలని సూచించింది. ఈ విషయాన్ని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు తెలిపారు.