ఏపీలోని కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తన నాలుగేళ్ల కుమారుడు ఆర్విన్ను అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. కలెక్టర్ స్వయంగా వచ్చిన తన కుమారుడిని చేర్పించడం చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ కేంద్రంలో ఇతర చిన్నారులతో కలిసి ఆర్విన్ ఆడుకుంటున్నాడు. స్వతహాగా ఆడంబరాలకు కలెక్టర్ కోటేశ్వరరావు దూరంగా ఉంటారు. తాజా ఘటనతో పలువురు ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.