వైసీపీ పార్టీ నేత, ఎంఎల్సి అనంతబాబు హత్య చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని ఆరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ తరపున 5 లక్షల రూపాయలు ఆర్ధిక సాయంగా బాధిత కుటుంబానికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ... ఆ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకూ……తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ పోరాటాలు చేస్తుందని మనో ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ఎస్సీ సెల్ నేతలు పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa