‘‘విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతన్నకు ప్రభుత్వం తోడుగా నిలిచింది. విత్తనాల సప్లయి నుంచి పంట కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అండగా నిలబడుతూ వస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు రైతులకు కావాల్సిన అధునాతన పనిముట్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. 1,140 వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్ యంత్రసేవ కేంద్రాలకు 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ ప్రారంభించిన అనంతరం.. 5,260 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61కోట్ల సబ్సిడీని సీఎం వైయస్ జగన్ జమ చేశారు.