పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి 83 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల ఫిర్యాదులు పరిశీలించి,వారికి సత్వరమే చట్టపరిధిలో న్యాయం జరిగేలా,వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను అదేశించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొంతమంది నవమాసాలు మోసి, కని, పెంచి, పోషించిన తల్లిదండ్రుల బాగోగులను విస్మరిస్తున్నారని,వారి పట్ల ప్రేమతో, ఆప్యాయంగా ఉండాలని,తల్లిదండ్రుల బాగోగులు చూడాలని లేని యెడల వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.