ఏపీలోని విశాఖపట్నంలో మంగళవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. నేహా (17), కృష్ణ (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని మంగళవారం వారిద్దరూ విషం తాగేశారు. ఈ ఘటనలో నేహా మృతి చెందింది. కృష్ణను ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారిళ్లలో విషాదం నెలకొంది.