వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వాహనదారుల కోసం ఓ ప్రత్యేక యాప్ ను తీసుకురానుంది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి. ఈ యాప్ లో తమ ఫోన్ నంబర్ ను నమోదు చేస్తే చాలు. అన్ని పత్రాలుంటాయి. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ప్రతిసారీ వాహనదారులు పత్రాలను తమ వెంట తీసుకెళ్లకుండా ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa