బహిరంగ మార్కెట్లో తోతాపురి మామిడి(బెంగళూర) కాయలు సోమవారం రాత్రి టన్ను రూ. 16 వేల నుంచి రూ. 15 వేలకు తగ్గింది. ఉన్నపళంగా టన్నుకు వెయ్యి రూపాయలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. పండ్లగుజ్జు పరిశ్రమల వ్యాపారులు సిండికెట్గా తోతాపురి మామిడికాయల ధరను తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో ధర తగ్గిపోవడంతో రైతులు బుధవారం మామిడికాయల కోతలను నిలిపివేశారు.