చిత్తూరు: పుత్తూరు పట్టణంలోని రామానాయుడు కాలనీలో మంగళవారం రాత్రి 9 గంటలకు విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు ఉక్కపోతతో నానావస్థలు పడుతున్నారు. ఇప్పటికీ కూడా విద్యుత్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో చాలామంది ఉద్యోగస్తులు త్రాగడానికి కూడా నీరు లేదని, చంటి పిల్లలు, చిన్నపిల్లలు సైతం రాత్రింతా జాగారం చేసినట్లు చెబుతున్నారు. గృహణిలు వంటవార్పు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలు విస్తుపోతున్నారు.