ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈనెల 9వ తేదీ నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు నగిరి సిపిఎం నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.