డ్రగ్స్, హత్య కేసుల్లో నిందితులను 12 మందికి ఇరాన్‌లో సోమవారం ఒక్కరోజే ఒకేసారి సామూహిక ఉరి శిక్ష అమలు చేశారు. అందులో ఒకరు మహిళ. వారంతా సున్నీ మైనార్టీలు. సిస్తాన్-బలుచెస్తాన్ ప్రావిన్స్‌లోని జహెదాన్ ప్రధాన జైలులో వారంతా ఉరితీయబడ్డారు. గతేడాది ఏకంగా 333 మంది ఖైదీలకు మరణ శిక్ష విధించారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa