మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి చెందిన ఓ బస్ కండక్టర్ బుధవారం మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ముర్బాద్ సమీపంలోని ఘాట్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపత్ ఈడే మల్షేజ్ ఘాట్ వద్ద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఈడీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.