ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపురం అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించేందుకు సోము వీర్రాజు బుధవారం బయలుదేరారు. అయితే అమలాపురంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున జొన్నాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే డ్యూటీలో ఉన్న ఎస్సైని నెట్టివేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.