ప్రకాశం జిల్లా చీమకుర్తి లో హత్య జరిగింది ప్రేమించి వివాహం చేసుకున్న ఓ యువకుడు తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపధ్యంలో ఆండ్ర అజయ్ తన భార్య పరి శుద్దమ్మ ను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. హతురాలిది పరుచూరు మండలం. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆంజనేయులు నేర స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది