కొరిసపాడు మండలం రావినూతలలో గురువారం ఉదయం విద్యుత్ ఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందాడు. రావినూతల హై స్కూల్ రోడ్డులో స్మశానం వద్ద బోర్ వేసే ప్రయత్నాల్లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. బోర్వెల్ డ్రిల్లింగ్ పాయింట్ వద్ద బోర్వెల్ వర్కర్ అయిన ఆ యువకుడు డ్రిల్లింగ్ రాడ్ ని అమర్చే ప్రయత్నంలో రాడ్ ఒరిగి పక్కనే ఉన్న విద్యుత్ లైన్ ని తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ యువకుడు 20 అక్కడికక్కడే మరణించాడు. ఈ యువకుడు చత్తీస్గడ్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జ్ బాచిన కృష్ణ చైతన్య ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ ఐ ఎం వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.