రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పదవ తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమేప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయులకు ఆన్లైన్ రిపోర్ట్ ల పని తప్పించాలని డిమాండ్ చేశారు.