చిలకలూరిపేట- నరసరావుపేట రహదారిపై కావూరు - లింగంగుంట్ల బ్రిడ్జి మలుపు వద్ద గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సరుకు రవాణా చేస్తున్న గూడ్స్ ఆటోలో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa