ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాలో జిల్లా మహానాడు నిర్వహణజిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలకు చంద్రబాబు నాయుడు నిర్ణయంతీసుకున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల మూడో వారం నుంచే ప్రారంభం కానున్న చంద్రబాబు జిల్లాల పర్యటనలు, మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ ఇంచార్జ్ లతో సమీక్షలు, క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు, జిల్లా టూర్ లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు.