అనంతపురం జిల్లా హిందుపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 62వ పుట్టిన రోజు వేడుకులను విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం నాడు గొల్లపూడి కార్యాలయంలో నిర్వహించిన బాలయ్య పుట్టిన రోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, బాలయ్య అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, కథానాయకుడిగా సినీరంగంలో, శాసనసభ్యుడిగా రాజకీయరంగంలో, క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా సామాజికరంగంలో. విశేష సేవలందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆభగవంతుని ఆశీస్సులతో బాలయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ నందమూరి బాలకృష్ణ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.