విప్లవాత్మకమైన మార్పులతో గడప వద్దకు వచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్ సీపీ అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం సత్తెనపల్లి మండలం కట్ట వారి పాలెంలో రెండో రోజు జరిగిన గడపగడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందించటంలో గతం కంటే భిన్నంగా ముందడుగులో ఉందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.