బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యూపీలో కూడా కొందరు నిరసన తెలుపుతూ పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో వారిపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ప్రయాగ్ రాజ్ లోని 5000 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు ఎస్ఎస్పీ అజయ్ కుమార్ వెల్లడించారు.