కృష్ణా జిల్లా, బందరు మండలం పల్లెతాళ్ళపాలెం కు చెందిన మోపిదేవి ప్రసాద్ (35) మచిలీపట్నం రూరల్ ప్రాంతం గోకవరం గ్రామం సమీపంలో శనివారం రాత్రి స్థంబాలు మార్చి కొత్తలైను బిగిస్తుండగా కరెంటు స్థంబం పైన ఉండగానే సర్వీసు వదిలిన విద్యుత్ సిబ్బంది. అనుకోకుండా కరెంటు రావడంతో విద్యుత్ షాక్ తగిలి క్రింద పడిపోయిన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈరోజు లైన్ మెన్ ఇంటికి వచ్చి ప్రసాద్ ను వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళాడని చెప్పుచున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగి ఒక మనిషి ప్రాణాలు కోల్పోతే విషయం బయటకు పొక్కకుండా విద్యుత్ సిబ్బంది మంతనాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోపిదేవి ప్రసాద్ లైన్ మెన్ దగ్గర హెల్పర్ గా పనిచేస్తునడు.
మోపిదేవి ప్రసాద్పై ఇద్దరు పిల్లలు, భార్య తల్లిదండ్రులు ఆధారపడి ఉంటున్నారు. ప్రసాద్ మరణంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ప్రసాద్ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, అతను లైను పైన పనిచేస్తున్నాడని తెలిసి కూడా కరెంటు ఎలా పునరుద్దరణ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కనీసం కుటుంభ సబ్యులకు సమాచారం అందజేయకుండా బందరు ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడినుండి చనిపోయాడు అని చెప్పడానికి ఫోన్ చేశారని. ఇందులో ఎదో తెలియని అంశాలను దాస్తున్నారని కుటుంభ సబ్యులు ఆరోపిస్తున్నారు. లైన్ మెన్ కు హెల్పర్ కు మద్య ఏదైనా అంతర్గ్హత విభేదాలు ఉండి ఇలా చేశారా అని అభిప్రాయ పడుతున్నారు.