ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అలాగే ఇతర రకాల గాడ్జెట్లు మితిమీరి వినియోగించడం సాధారణం అయిపోయింది. అయితే ఎక్కువగా గాడ్జెట్లు ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కళ్లలో మంట, పొడిబారిపోవడం, అస్పష్టంగా కనిపించడం, మెడ, వెన్ను నొప్పి సమస్యలు వస్తున్నాయి. వీటికి స్మార్ట్ ఫోన్ పరికరాల స్క్రీన్ నుండి వెలువటే బ్లూ లైట్ కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్ల స్క్రీన్లు బ్లూ లైట్ ను, అధిక శక్తి గల కాంతిని రిలీజ్ చేస్తాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే కంటి చూపుకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం యాంటీ క్లియర్ కలిగిన కళ్లద్దాలు ఉపయోగించాలని కంటి నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, సెల్ ఫోన్లు ఉపయోగించే వారు ఈ కళ్లద్దాలు వినియోగిస్తే మంచిది. వీటిని ధరించాక కూడా ప్రతి 20 నిమిషాలకు ఓ సారి స్క్రీన్ ను చూడకుండా ఒకటి లేదా రెండు నిమిషాలు కళ్లు మూసుకోవాలి. స్క్రీన్ లో ఫాంట్ సైజ్ పెంచుకోవడం ద్వారా కంటిపై భారం పడకుండా ఉంటుంది.