ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలులో గుర్తు తెలియని శవం...ఆచూకి కోసం సంప్రదించాలన్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 11:29 PM

రైలు  ఉన్నత వర్గాల కంటే పేదోడికే అవసరమైన రథం. అలాంటి రైలులో ప్రాణాలు విడిచాడు ఓ ప్రయాణికుడు.  రైలు బోగిలో మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి చెరుకొన్న రైలులోని సాధారణ బోగీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న సాధారణ బోగీని క్లీన్ చేయడానికి వెళ్లిన పారిశుద్ధ కార్మికులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని స్టేషన్ అధికారులకు చెప్పారు.


తిరుపతి రైల్వే స్టేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి (45-50)గా పోలీసులు గుర్తించారు. మృతుడు నలుపు రంగు టీ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com