నుపుర్ శర్మ చేసిన పనిని మనదేశ వ్యతిరేక శక్తులు వాటిని తమకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళనలు కొనసాగుతున్న అంతర్లీనంగా కొన్ని శక్తులు లేని పన్నగాలు పన్నుతున్నాయి. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో నుపుర్ శర్మ తీవ్ర చర్చనీయాంశంగా మారారు. నుపుర్ ను బీజేపీ వర్గాలు సస్పెండ్ చేసినప్పటికీ ఆమెపై ఆగ్రహావేశాలు చల్లారడంలేదు. ఈ క్రమంలో కశ్మీర్ కు చెందిన ఫైజల్ వనీ అనే యూట్యూబర్ పోస్టు చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. వనీ ఓ ఆయుధం చేతబట్టి నుపుర్ తల నరుకుతున్నట్టుగా ఆ వీడియోలో ఓ గ్రాఫిక్స్ సీన్ ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీన్ని తీవ్రంగా పరిగణించిన సఫా కడాయ్ పోలీసులు యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్ట్ చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాడని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ప్రచారం చేస్తున్నాడన్న అభియోగాలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ 505, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలావుంటే తన వీడియోపై తీవ్ర దుమారం రేగడంతో వనీ ఆ వీడియోను తొలగించాడు. తన అరెస్ట్ కు ముందు మరో వీడియో పోస్టు చేసి క్షమాపణలు కోరాడు. ఏ మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు.