కరోనాతో రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి 17 వరకు ఈ ప్రక్రియను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఒకే ప్రాంతంలో 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా డివిజన్ల స్థాయిలో తప్ప మండలాలు, ఇతర కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉన్నారు.