బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, చుండూరు మండల పరిధిలోని చినగాదేలవర్రు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్త నక్కా లక్ష్మయ్య అడ్డుకున్నాడని, ఆదివారం రాత్రి 1 గంటకు లక్ష్మయ్యని ఇంట్లో నుండి బయటకు తీసుకొని వెళ్లి మారణ ఆయుధాలు తో దాడి చేశారు. సదరు వ్యక్తిని తెనాలి ఏరియా వైద్యశాలకు కుటుంబ సభ్యులు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జనరల్ హాస్పిటల్ కు తరలించారు.