గుంటూరు: చలో కంతేరు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని శ్రేణులు కంతేరు గ్రామానికి వెళ్లకుండా ఆరండల్ పేట పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యాలయంలోని నేతలను బయటకు రానివ్వకుండా పూర్తిస్థాయిలో వారిని అడ్డుకుంటున్నారు. పోలీసులతో వాగ్వివాదం పెట్టుకున్న పలువురునేతలను అరెస్ట్ చేశారు.