ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అజయ్ కల్లం పదవీకాలం ఈ నెల 3వ తేదీతో ముగిసింది. అయితే ఆయన పదవీకాలాన్ని ఈ నెల 4వ తేదీ నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.