అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఇచ్చి ఓటు అడుగుతానని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంక టేశ్వరరావు (నాని) అన్నారు. మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21కి స్థానిక బొమ్ములూరు రోడ్డులోని 8, 900 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మౌలిక వసతులు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
300 చద రపు గజాల ఇంటికి రూపాయి, 360 చదరపు గజాల ఇంటికి రూ 25 వేలు, 430 చదరపు గజాల ఇంటికి రూ 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకో వాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీటికి రూ 50 వేలు, లక్ష వసూలు చేశారని జగన్మో హనరెడ్డి వీటిని సగానికి తగ్గించారని వివరించారు. ఇప్పటికే రూ 50 వేలు చెల్లించిన వారికి రూ 25 వేలు, లక్ష చెల్లించిన వారికి రూ 50 వేలు ప్రభుత్వం తిరిగి ఇస్తుందని హామీ ఇచ్చారు.
ఈ నెల 15వ తేదీనుంచి సచివాలయాల వారీగా లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్థానిక కైకాల కళామందిరంలో ప్రారంభిస్తారని తెలిపారు. డిసెం బర్ 21వ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఇతర అధికారులు పాల్గొన్నారు.