జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులూ మాట్లాడుతూ... సాగు నష్టాలతో, అప్పుల భారంతో కుంగిపోయి సుమారు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న పక్షంలో రూ.7 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. కానీ ఈ సాయం అందించటం లేదు. కౌలు రైతులకు అండగా నిలిచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు అని తెలియజేసారు.