మార్టూరు కిషోర్ కాలనీలో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలిక మల్లి దిబోరా మృతి చెందింది. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఆ బాలిక తల్లి అమ్మమ్మల తో కలిసి తన ఇంటి వరండాలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. అది నేరుగా బాలికను తాకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తల్లి అంజలికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై రవీంద్రా రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.