నూతన పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పలు భద్రత చర్యలలో భాగంగా నరసరావుపేట 1వ, 2వ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రదేశాలలో నూతనంగా అమర్చిన సుమారు 130 కెమెరాలను రిబ్బన్ కత్తిరించి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్ ప్రారంభించారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం చైన్ స్నాచింగ్, నిర్లక్ష్యంగా మరియు ప్రమాదకరంగా వాహన చోదకం,ఈవ్ టీజింగ్ వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలపాలను అరికట్టడం. ఇక నుండి ఏదైనా ప్రదేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు,సత్వరమే ఈ కెమెరాల ద్వారా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన హెచ్చరించారు.