ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పథకాలు పార్టీలకు అతీతంగా ప్రతి గడపకు చేరువ చేయాలని వైఎస్సార్ సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు పేర్కొన్నారు. జరుగుమల్లి మండలం లోని నరశింగోలు గ్రామంలో బుధవారం మండల అధికా రులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, నాయ కులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.