బిఎస్ఎన్ఎల్ అంటే అదో పాత సాంకేతిక విభాదం అన్న భావన మనలో ఉంది. కానీ నేడు అన్ని టెలికాం సంస్థలతో పోటీపడి మరీ దూసుకెళ్తోంది. ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆకర్షణీయమైన ధరతో కొన్ని ప్లాన్‌లను యూజర్లకు అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌లను అందుబాటు ధరల్లోనే ఇస్తోంది. సాధారణంగా ప్రైవేట్ టెలికం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ప్లాన్‌లను బిఎస్ఎన్ఎల్ ఇస్తుంటుంది. ఇదే రీతిలో 90 రోజుల వ్యాలిడిటీతో ఉండే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు బీఎస్ఎన్ఎల్‌లో ప్రయోజనకరంగా ఉన్నాయి. రూ.500లోపు ధరలోనే వీటిని బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ప్రతీ రోజు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు సహా కొన్ని అదనపు బెనిఫిట్స్ ఈ ప్లాన్‌ల ద్వారా దక్కుతాయి. మ
రూ.500లోపు ప్లాన్ కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్‌లో ఇది బెస్ట్ ప్లాన్‌గా చెప్పవచ్చు.బిఎస్ఎన్ఎల్ రూ.499 (ఎస్టీవీ_499) ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జింగ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లలో రోజువారి డేటా అయిపోయాక 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
ఈ రెండు ప్లాన్‌లను పరిశీలిస్తే రూ.499 ప్లాన్ బెస్ట్‌గా ఉంది. రూ.485 ప్లాన్‌తో పోలిస్తే రూ.15లే తేడా అయినా రోజుకు 0.5 జీబీ అధికంగా లభిస్తోంది. వినియోగించుకుంటే జింగ్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా దక్కుతుంది. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ బెనిఫిట్ కూడా దక్కుతుంది.
ప్రస్తుతం దేశంలో బీఎస్ఎన్ఎల్ 3జీ నెట్‌వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. నెట్‌వర్క్ అత్యుత్తమంగా ప్రాంతాల్లో ఈ ప్లాన్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే త్వరలోనే దేశంలో 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు బిఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. 4జీ సర్వీస్‌లు వచ్చాక ఈ ప్లాన్‌లు మరింత బెస్ట్‌గా ఉపయోగపడతాయి.