ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకొంటానని మోసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే...పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 02:42 AM

బీజేపీ ప్రజాప్రతినిధులు ఇటీవల వివాదాల్లో చిక్కుకొంటున్నారు. మోసం, దగా, దొమ్మీలు ఇలా పలు కేసుల్లో వారు నేరస్థులుగా మారుతున్నారు. తాజాగా  ఒడిశాలోని బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడ మోసం చేశారని ఓ యువతి ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులను కూడా ఆశ్రయిస్తానని వెల్లడించింది. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లోని బీజేడీ ఎమ్మెల్యే బిజయ శంకర్ ‌దాస్‌పై ఈ విమర్శలు వచ్చాయి. ఆయన ప్రియురాలుగా చెప్పుకుంటున్న సోమాలికా దాస్ అనే అమ్మాయి ఆయనపై ఫిర్యాదు కూడా చేస్తానని తెలిపింది.


ఆమె కథనం ప్రకారం.. 2022 మే 17 జగత్‌సింగ్‌పూర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బిజయ, సోమాలికా దాస్ పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. వివాహం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శుక్రవారం స్లాట్ ఇచ్చారు. ఆ సమయానికి సోమాలిక కార్యాలయానికి చేరుకున్నారు, కానీ ఎమ్మెల్యే కానీ.. అతని కుటుంబ సభ్యులు ఎవరూ అక్కడకు రాలేదు. వారి కోసం సోమాలిక దాదాపు మూడు గంటలపాటు నిరీక్షించింది. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది.


తర్వాత షెడ్యూల్ చేసిన సమయానికి ఎమ్మెల్యే బిజయ్ కోర్టుకు రాలేదని సోమాలిక తెలిపింది. అంతేకాదు "ఈ నెలలో ఏం జరిగిందో నాకు తెలియదు. బిజయ్ నా ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదు. అతను తను ఇచ్చిన మాటను తప్పాడని.. లేదా మరొక మహిళతో సంబంధాన్ని పెంచుకున్నాడని నేను భావిస్తున్నాను." అని సోమాలిక చెప్పింది. అంతేకాదు ఎమ్మెల్యే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని.. అతనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేస్తానని సోమాలిక తెలిపింది. అంతేకాదు తనను ఎమ్మెల్యే బిజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com