అస్సాం, మేఘాలయలో ఇపుడు ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. ఎక్కడైనా ఆసరా దొరికితే అక్కడ కొండ చరియాలు విరిగిపడతాయోమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. మేఘాలయ, అసోంలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ముంచెత్తుతున్న వరదలు, కొండచరియలు విరిగిపడి ఎంతో మంది మృతి చెందారు. ఒక్క అసోంలోనే 55 మంది చనిపోయినట్టు అసోం విపత్తు నిర్వహణా సంస్థ అధికారులు వెల్లడించారు. ఎడతెగని వర్షాలు కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నదులు ఉధృతంగా ప్రవహించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఈ వరదల కారణంగా అసోంలోని హోజాయ్, నల్బారి, బజలి, ధుబ్రి, కమ్రూప్, కోక్రాజార్, సోనిత్‌పూర్ జిల్లాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. హోజాయ్, సోనిత్‌పూర్‌లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. హోజాయ్ జిల్లాలోని ఇస్లామ్‌పూర్‌లో.. వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. 21 మందిని అధికారులు రక్షించారు. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మొత్తం 18.94 లక్షల మంది ప్రభావితమయ్యారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బులెటిన్ విడుదల చేసింది.
ఈ వరదల పరిస్థితిని తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సీఎం హిమంత బిస్వా శర్మకు ఫోన్ చేశారని అధికారులు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.
లాగే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మేఘాలయలో ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్టు సమాచారం. ఇటు కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా కేఆర్ పుర ప్రాంతంలో మిథున్(24) అనే యువకుడి బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయాడు.