ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 09:52 AM

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూనియర్ పేర్కొన్నారు. సైనిక నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అగ్నిపథ్ పథకం వల్ల యువతకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. కేవలం 4 ఏళ్లు మాత్రమే యువతకు సైన్యంలో అవకాశం కల్పిస్తూ ఈ పథకాన్ని రూపొందించడం సరికాదని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అగ్నిపత్ ద్వారా నియామకమైన సైనికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com